Book

అనురాగాలు-ఆత్మీయతలు

డా|| రాచకొండ నరసింహశర్మ,

Book

నివేదన
   సుమారు ఇరువదియేండ్ల ప్రాయము నుండి తెలుగు- ఆంగ్లములలో కవితా రచన నా ప్రవృత్తి. 1960-63లో తెలుగులో వచన కవితలు (స్వార్థం; మానవుడా) ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైనవి.
  1967 నుంచి 2004 మే నెల వరకు నేను అమెరికాలో ఉన్నాను. 1971-72లో ఎక్కువగా ఆంగ్ల కవితలు తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. 1972-1984 మధ్య వ్రాసిన ఆంగ్ల కవితలు అక్కడ వారపత్రికలలో ప్రచురించబడ్డాయి. 1996-2002 మధ్య కొన్నితెలుగు వచన కవితలు అమెరికాలోని 'తెలుగు జ్యోతి', 'తానా' పత్రికలలో ప్రచురించబడ్డాయి.
  1975-95 మధ్యకాలంలో కొద్దిగా వ్రాసినా, ఉద్యోగ విరమణా నంతరం-అంటే 1995 నుంచి తెలుగు పద్యకవితలు ఎక్కువగా వ్రాయడం జరిగింది. 2004 మే లో మన దేశం వచ్చి విశాఖపట్నంలో స్థిరపడిన తరువాత బంధుమిత్రుల మధ్య ఉండడంవల్ల ఇందులో ఉన్న కవితలు సగంపైన వ్రాయడానికి వీలైంది.
  1971-84 మధ్యకాలంలో, వారు అమెరికాలో ఉన్నప్పుడు, తెలుగులోనూ, ఆంగ్లంలోనూ నా కవిత్వ రచనను ప్రోత్సహించిన వయోధికులు, ద్వాదశ భాషా ప్రవీణులు ఆచార్య కోట సుందరరామ శర్మగారికి కృతజ్ఞతా ప్రణామములు.
  2002లో ప్రముఖ సాహితీ వేత్త డా|| వెలగా వెంకటప్పయ్యగారిని కలిసే అదృష్టం కలిగింది. అప్పటికి నేను వ్రాసి ఒక మూల పడవేసిన కవితలన్నీ (అనువాద కవితలు సహితం) ఓపికతో చదివి, ప్రచురించమని హెచ్చరించి, ఇంకా వ్రాయమని ఉత్సాహ పరిచినందుకు వారికి నా కృతజ్ఞతా నమస్కృతులు.
  2002లోనే లేఖలద్వారా ఆచార్య తంగిరాల సుబ్బారావుగారితో పరిచయం లభించింది. నా కవితలు కొన్ని వారు సంపాదకులైన 'చైతన్య కవిత' పత్రికలో ప్రచురించారు.
  మన దేశానికి తిరిగి వచ్చిన తరువాత ఈ క్రింది పేర్కొన్న మాన్య కవుల పరిచయ భాగ్యం లభించింది.
  ఈ కావ్యంలో సుమారు పది కవితలు, నేను టెలిఫోన్‌లో చదువగా, వారు తీరిక చేసుకొని, శ్రద్ధతో విని, ఆశువుగా అక్షరలక్షలు చేసే స్వల్ప మార్పులు సూచించినందుకు కవివతంస శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారికి నా మనఃపూర్వక కృతజ్ఞతాభినందనలు, ఆశీస్సులూను.
  వారి కావ్య రచనా వ్యాసంగం, సొంత పనులు వెనకకు పెట్టి, ఈ కావ్యములోని అన్ని కవితలు తీరికగా చదివి, అలతి మార్పులతో ఈ కావ్యాన్ని శతసహస్రాధికముగా చక్కబర్చి, కావ్య ముద్రణ పూర్తయ్యేదాకా, అన్నిస్థాయిలలోనూ, సహాయం చేసిన మధుర కవితా సరస్వతి, మహాకవి ఇత్యాది బిరుదాంకితులు శ్రీ దుగ్గిరాల రామారావుగారికి నా కృతజ్ఞతా నమోవాకములు. వారి కార్యదీక్ష అకుంఠిత మైనది. ''విఘ్నాయత్తుడనై పరిత్యజించు మధ్యముడను'' నేను. ''విఘ్న నిహన్యమానులైన ధీరులు, ప్రజ్ఞానిధులు'' వారు. వారి సహృదయత- సౌహార్ద్రత-సౌజన్యతలు మరువరానివి, లోకోత్తరమైనవి.
  తొంబది ఏండ్ల వయసు సమీపించినా, తెరపిలేని సాహిత్య కలాపములలో నిమగ్నులగుచు తీరికలేకున్నా, అల్ప వ్యవధిలో ఈ కావ్యం ఆద్యంతం చదివి, అమూల్యమైన ''ప్రియవచనం'' వ్రాసి ఇచ్చిన కవిశేఖర ఇత్యాది బిరుదాంకితులు, శతాధిక గ్రంథకర్తలు శ్రీ కొండేపూడి సుబ్బారావు మహోదయులకు నా కృతజ్ఞతా ప్రణామములు.
  నిరంతర కావ్య రచనలలోనూ, గ్రంథ సమీక్షలలోనూ, క్షణమైనా తీరిక లేకున్నా, మా అన్నగారిపై వారికున్న గౌరవాభిమాన ప్రేరితులై, నా ఈ ఖండ కావ్యమును ఆర్ష సంప్రదాయములో, ఉపనిషత్‌ వ్యాఖ్యాన పూర్వకంగా సమీక్షించి, ఔదార్యమైన ఆదరముతో ''సత్కృతి''ని ప్రసాదించిన మాన్య మహోదయులు, కేంద్ర సాహిత్య అకాడమి ఉత్తమ గ్రంథ పురస్కార గ్రహీతలు, మహిశూర దత్త పీఠ ఆస్థాన విద్వత్కవి శ్రీ ఉత్పల సత్యనారాయణాచార్యులు గారికి నా కృతజ్ఞతా నమోవాకములు.
  చైతన్య కవితా సంపాదకత్వముతోను, ఇతర సారస్వత కార్యక్రమాలతోను, నిమిషమైనా వ్యవధి లేకపోయినా, నా అభ్యర్థనను మన్నించి, ఈ ఖండ కావ్యాన్ని ఆమూలాగ్రం పరిశీలించి, వివరంగా విశ్లేషించి, విశాలహృదయంతో విపులమైన సమీక్ష వ్రాసి ఇచ్చిన ఆచార్య తంగిరాల సుబ్బారావుగారికి నా కృతజ్ఞతా నమస్సుమాంజలులు.
  వ్రాతప్రతులు త్వరలో టైపుచేసి ఇచ్చినందుకు, విశాఖపట్నంలోని, శ్రీ రాయితీ నవీన్‌కు, ఓం నమశ్శివాయ జెరాక్స్‌ కంపెనీ వారికి, చైతన్య జెరాక్స్‌ కంపెనీవారికి, నా కృతజ్ఞతాభినందనలు.
  ఈ కృతి ఇంత సుందరాకృతిని సంతరించుకొనుటకు కారకులు హైదరాబాద్‌లోని శ్రీ కుడుపూడి భాస్కరరావు (మను గ్రాఫిక్స్‌)గారు, శ్రీ ఎ. జగన్మోహన్‌ రెడ్డి (కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటిర్స్‌) గారు. వారికి నా కృతజ్ఞతలు.
   
-డా|| రాచకొండ నరసింహ శర్మ
   
Read Book

అనురాగాలు-ఆత్మీయతలు

Publication Date: Nov 01, 2005

Publisher: మను గ్రాఫిక్స్

Edition: 2005

Language: Telugu

Pages: 120

 
 
 
This is Terms and conditions page description
This is product content page description
This is privacy policy page description
The Publisher of this website makes every effort to be as accurate and complete as possible in the creation and curation of the content published on this site. However, Publisher does not warrant or represent at any time that the contents within are accurate due to the rapidly changing nature of the Internet. The Publisher will not be responsible for any losses or damages of any kind incurred by the reader whether directly or indirectly arising from the use of the information found on this website. The authors and Publisher reserve the right to make changes without notice. The Publisher assumes no responsibility or liability whatsoever on the behalf of the reader of this website. No part of the content available in the website may be reproduced or transmitted in any form or by any means, electronic or mechanical, including photocopying, recording or by any information storage and retrieval system, without written permission. This website is not intended for use as a source of legal, health, business, accounting or financial advice. All readers are advised to seek services of competent professionals in the legal, health, business, accounting, and finance fields. There are no representations or warranties, express or implied, about the completeness, accuracy, reliability, suitability or availability with respect to the information, products, services, or related graphics contained in this website for any purpose.