సంత్ గాడ్గే బాబా
ఫాదర్ ఆప్ ధీ క్లిన్లీ నెస్
చరిత్రలో పరిశుభ్రత దైవమని నిర్వహించిన తోలి సంస్కర్త. చీపురుతో వీధుల్ని, కీర్తనలతో మస్తిష్కాలను శుభ్రం చేసిన వాగ్గేయకారుడు. గుడికి బదులు బడిలో ఆధ్యాత్మికతను వెదికినవాడు. నిమ్నవర్గాలకు అంబెడ్కరే దేవుడన్న దార్శనికుడు. సామాజిక న్యాయం కోసం పరితపించిన సాంఘిక విప్లవకారుడు. షిర్డీసాయి శిష్యుడు, మెహర్ బాబాకి ఆత్మీయుడు
సమస్త ఛాందసాలనూ హేతువుతో ఖండించిన సాధువు, ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పిన పర్యావరణవాది. యావజ్జీవితాన్ని సంఘానికి అర్పించిన సర్వసంగ పరిత్యాగి స్ఫూర్తిదాయక చరిత్ర ఇది.