భూమిక
తెలుగులో సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలేకాక, వార్తాపత్రికలు వివిధ విషయాల మీద రకరకాల విజ్ఞానపత్రికలు విరివిగా వచ్చాయి.
వార్తలయితే ఆలశ్యంకాకూడదు. ఆలశ్యమైతే 'చద్ది' అవుతాయి. అందుకని వార్తలని అందించే పత్రికలు, దినపత్రికలయ్యాయి. విజ్ఞాన పత్రికలు వార, పక్ష, మాస, ద్వైమాస, త్రైమాసిక, అర్ధ సాంవత్సరిక, సాంవత్సరిక పత్రికలుగా వస్తున్నాయి. కాలపరిమితిని ఒకటిగానే ఉంచుకున్నాయి.
తెలుగులో ఈ విజ్ఞానపత్రికలు ఎలా ఎలా వచ్చాయి, ఎప్పుడొచ్చాయి-ఆ క్రమాన్ని చెప్పడానికి చేసిన చిరు ప్రయత్నమిది. దాదాపు సంపూర్ణంగా ఉందనే నా భావన. నా పరిశోధనలో ఏ కొద్ది లోపాలున్నా నేను సరిచేసుకోవడానికి సంసిద్ధుణ్ని. ఇది నా పరిశోధనలో (పిహెచ్.డి.) ఒక భాగం. తెలుగులో వచ్చిన పత్రికల్ని వరుసగా స్పృశించాను.
తెలుగు ప్రపంచమహాసభల సందర్భంగా ఈ మోనోగ్రాఫ్‌ని ప్రచురిస్తున్న తెలుగు అకాడమీ వారికి కృతజ్ఞతలు.
-వేదగిరి రాంబాబు