హృదయం ఎక్కువ కులాలవాళ్ళం అనుకునేవాళ్లు తక్కువకులాల వాళ్ళకంటే ఏ మాత్రం తక్కువవాళ్ళు కాదు అనేది నా జీవితం. మతాలలోని మానవత్వం ఏకైక మార్గంలో సాగాలని నా అభిమతం. మతైక్యం సాధించే లక్ష్యంలో మతాంతర వివాహాలు జరగాలనేది నా ఆశయం. భవిష్యత్తులో ప్రవర్తిల్లే ప్రపంచంలో ఏ విధంగానూ తేడాలు ఉండకూడదని నా ఆశ. క్రీస్తు రక్తతేజంలో సందేశమూ, గాంధీ రుధిరచ్ఛాయల్లో ధర్మమూ, బుద్ధుని నెత్తుటి చారలు జాడల విద్యుత్తులో అహింసా సమతకు నవ్యనాందీ అని నా హృదయం. విశ్వం, దైవం, మానవత్వం, మానవజీవితం అంతా ఒక్కటేనని నా కాంక్ష. జీవనంలో, చేతనంలో, జిగీషలో,జీవికలో మమతలతో, మధురిమలతో, మనస్సులతో, మధువులతో మానవుడు మహోత్తముడు అనేది నా నమ్మకం. ఓం! జీవితం శ్రీకారం. దేవుడు పరిపూర్ణుడు. సృష్టి చిరంజీవి. ఏ పేరూ, ఏ రూపూలేని దైవమా! సర్వసౌఖ్యాలూ కలిగించే మతసమన్వయం సృష్టించు. మానవతా హృదయదీపిక వెలిగించు. మానవజాతి ప్రగతికీ పురోగతికీ భవిష్యత్తు బాట చూపించు, ఆమెన్- ఇది నా ప్రార్థన. కవి మనస్సూ, ఋషి తపస్సూ, దేవుడి తేజస్సూ, సూర్యుడి ఉషస్సూ ఏకత్వం బోధించే కాంతిపుంజాలు. ఇది నా భావన. సృష్టి, బాధ, హృదయం, కవిత్వం, స్వర్గం, నరకం, జననం, మరణం, సమతను బోధించే పతాకలు - నా నిర్ణయం. ద్వంద్వాలు విభిన్నాలు కావు. భూమధ్యరేఖకు రెండు అంచులు. భూగోళానికే రెండు ధ్రువాలు. మానవత్వానికి రెండు దిక్కులు. స్త్రీ పురుషులు ద్వంద్వాతీతులు - నా సమన్వయం. మానవ మనస్తత్వంలో మార్పురావాలి. మానవుడు మహామానవుడూ, మాధవుడూ కావాలి - నా కోర్కె. కష్టం, నష్టం, సుఖం, భాగ్యం వెంట నీడలులా వుంటాయి. అహింసను హింస వెంటాడుతూ వుంటుంది. చీకటి పగలు రెండు సంధ్యలు - నా అనుభవం. కాలం అనంతం. సృష్టి అనంతం. ధర్మం అనంతం. మానవత్వం అనంతం - నా నిరీక్ష. సమాధి గుండెలో నవ్వువుంది. సౌరభం వెదజల్లే గులాబిపువ్వు పుట్టుక ముళ్ళవిూద జరిగింది. దేవుడి ప్రేమలో దెయ్యం జీవితం సంపాదించుకుంటుంది. అంతం లేని ఆకాశం అంచుల కౌగిలిలో అవధి దాటిపోతుంది. ప్రకృతి సౌందర్యంలో పాప ఏడ్పులో, పసివాడి వలపులో దైవత్వం నృత్యం చేస్తుంది. ప్రాణం పోయే తాత అనుభవంలో, సముద్రం ఘోషలో, అగ్నిజ్వాల అందంలో, చీమనవ్విన సవ్వడిలో, అనంతంలో మిళితమయ్యే ఆరిపోయిన దీపకళికలో,పెళ్ళి తోరణంలో, శవశరీరంవిూది అత్తరు సువాసనలో, పెరుగుతున్న మొక్కలో, విరుగుతున్న కొమ్మలో జగత్తు రహస్యం లీలగా దోబూచులాడుతూ కదులుతుంది. ఇది నా కవిత్వం. నా నవలపేరు సమత. సమత నా సాహిత్యం. నా సర్వస్వం. నాలోని చైతన్య సంకల్ప సర్వానికీ రాజారావు కొంతవరకు భంగ్యంతరంగా సంకేతం. చంద్రునికొక నూలుపోగు. సమత నవలలో రాజారావు పాత్ర ఒక కల్పన. నవ్యత్వ కవిత్వం నా తత్త్వం. నాయకుడు మామూలు యువకుడు! సమత నవనీతం. నా ధ్యేయం వర్ధిల్లుతుంది. నా లక్ష్యం పునీతమవుతుంది. నేను భారతీయుడ్ని. ప్రపంచ పౌరుడ్ని, నాకు మానవత్వం విూద విశ్వాసం ఉంది. మనీషి జయశీలి. జనత జయిస్తుంది.
-కొలకలూరి చిత్తూరు సెప్టెంబరు 1961
Read Book
సమత-అనాథ
Publication Date: Mar 03, 2010
Publisher: జ్యోతి గ్రంథమాల
Edition: 2010
Language: Telugu
Pages: 473
of
This is Terms and conditions page description
This is product content page description
This is privacy policy page description
The Publisher of this website makes every effort to be as accurate and complete as possible in the creation and curation of the content published on this site. However, Publisher does not warrant or represent at any time that the contents within are accurate due to the rapidly changing nature of the Internet. The Publisher will not be responsible for any losses or damages of any kind incurred by the reader whether directly or indirectly arising from the use of the information found on this website. The authors and Publisher reserve the right to make changes without notice. The Publisher assumes no responsibility or liability whatsoever on the behalf of the reader of this website. No part of the content available in the website may be reproduced or transmitted in any form or by any means, electronic or mechanical, including photocopying, recording or by any information storage and retrieval system, without written permission. This website is not intended for use as a source of legal, health, business, accounting or financial advice. All readers are advised to seek services of competent professionals in the legal, health, business, accounting, and finance fields. There are no representations or warranties, express or implied, about the completeness, accuracy, reliability, suitability or availability with respect to the information, products, services, or related graphics contained in this website for any purpose.