1989 సంవత్సరం ఒక యుగపు బాధాకరమైన అంతానికి గురుతు. వ్యవస్థా వ్యతిరేక శక్తుల ఓటమిగా పిలుస్తున్న అది నిజానికి గొప్ప విముక్తి. దీనితో పెట్టుబడిదారీ ప్రపంచ - ఆర్థిక వ్యవస్థకి ఉదారవాద - సోషలిస్టు సమర్ధనలని తొలగించింది. ఆ రకంగా అది ఆధిపత్యా ఉదారవాద భావజాలర కూలిపోవడానికి చిహ్నం.
మనం అడుగుపెట్టిన కొత్త యుగం మరింత మోసపూరితమైనది. మనకి తెలీని దారుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. మనకి గతంలోని పొరపాట్ల గురించి తెలిసినంతగా సమీప భవిష్యత్తులోని అపాయాల గురిరచి తెలియుదు. సాంఘిక పరివర్తనకు ధీటైన వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి సమిష్టి బృహత్ప్రయత్నం అవసరం.