Book

మరణ తరంగం (కథానికా సంకలనం)

డా|| కె.బి.గోపాలమ్,

Book
ఒక అందమయిన అంతం
  ఏకకణ జీవులు, ఒకటి రెండవుతాయి. రెండు నాలుగవుతాయి. అట్లా పెరుగుతూ పోతుంటాయి. వాటికి చావులేదు.
  శరీరంలో అంగాల వ్యవస్థ మొదలవుతుంది. అక్కడే చావూ మొదలవుతుంది. తాము తినాలి, బతకాలి, కొనసాగాలి. తన జాతిని తిన్నా ఫరవాలేదు. బతకాలి ఇంకొకరిని చంపినా సరే తాము బతకాలి.
  మనిషికి అనవసరంగా, ఆలోచన ఉంది. మిగతావాళ్ళను చంపడానికి, తాను బతకడానికీ ఈ ఆలోచన ఎంత సహాయం చేస్తుందో? ఆ మిగతా వాళ్ళు తనను చంపితే? అమ్మో! ఇంకేమయినా ఉందా? మనం లేకున్నా తర్వాత ఈ ప్రసంగం ఉంటేనేం? పోతేనేం?
  అందరూ చావచ్చు. మనం చావకూడదు. మన అమ్మానాన్న అసలే చావగూడదు!
  మనం పుట్టిన మరుక్షణం నుంచే చావు మొదలవుతుంది. ఈ సంగతి ఎవరికీ నచ్చదు. ఎవరికీ అర్థం కాదు. మనిసి బతుకు కథకు, చావు ఒక అందమయిన అంతం. వద్దంటే అది ఆగదు! ఎప్పుడొస్తుందో తెలియదు. కనుకనే చావంటే అదొక అర్థంగాని విషయం!
  మరణం మనిషిని రకరకాలుగా తాకుతుంది. బుజ్జగిస్తుంది. బాధపెడుతుంది. బాధ నుండి విముక్తి వస్తుంది. కావలసిందల్లా మనం మరణం గురించి అర్థం చేసుకోవడమే!
  మరణం మొదట్లో అర్థం కాదు. మూడేళ్ళ వయసులో అప్పన్న 'పల్లెవాగు రైలు ప్రమాదం చూశాను. అక్కడ కొంతమందిని వరుసగా పడుకోబెట్టారు. వాళ్ళకేమయింది?' అని అడిగినట్లున్నాను! 'వారంతా చనిపోయారు' అని నాన్న జవాబు. నాకు అర్థం కాలేదు.
  ఆ తరువాత కొన్ని దినాలకే తాతయ్య పోయారు. నాకది చూచాయగా గుర్తుంది. కానీ అర్థం కాలేదు. ఒక వ్యక్తి అనారోగ్యం మొదలు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నాడు. ఆయన పోయాడు. 'అది మంచిదే గదా!' అనిపించింది. అదే మాట అన్నట్లున్నాను. అందరూ ఆశ్చర్యపోయారు. ఇటువంటివి మరెన్నో జరిగాయి. వివరాలు అవసరం లేదు.
  నాకు మరణమంటే గౌరవంతప్ప, భయంలేదు. ఈ సంగతి బాగా మనసునకు ఎక్కింది.
  కథలు రాయను అనుకుంటున్న రోజుల్లో వేదగిరి రాంబాబు గారి ప్రోత్సాహంతో అనువాద కథలు స్వాతి మాసపత్రికలో పదినెలల పాటు వచ్చాయి. బుర్ర నిండా మరణమే! మరెన్నో కథలున్నా, వరుసను ఆపాలనిపించింది.
  తరువాత కూడా మరణం గురించి చదవడం, ఆలోచన రావడం ఆగలేదు. సంకలనంలోని చివరి కథలు అందుకు ఉదాహరణలు. వాటికి ముందు వ్యాఖ్యానాలు లేవు. ప్రీతీష్‌నంది కథలో మరణం కనిపించదు. కానీ కథ మరణం గురించే.
  ఇన్నాళ్ళ తరువాత రాంబాబు గారి సంకల్పంగానే -ఈ కథలు సంకలనంగా వస్తున్నాయి. మరణాన్ని గౌరవించిన రచయితలలో పాలగుమ్మి పద్మరాజుగారి తరువాతే ఎవరయినా! వారి శతజయంతి సందర్భంగా, ఈ అక్షరనివాళి-నాకు కలిగిన గొప్ప గౌరవం!
  మనిషికి మరణం లేదు. గొప్ప మనిషికి మరణం అసలే లేదు. గొప్ప భావానికి మరణమనే ప్రశ్నే లేదు.
  మరణం అంతం కాదు. అది అందమయిన ప్రారంభం!
  -కె.బి.గోపాలమ్‌
Read Book

మరణ తరంగం (కథానికా సంకలనం)

Publication Date: Oct 01, 2014

Publisher: Sri Vedagiri Communications

Edition: October 2014

Language: Telugu

Pages: 93

 
 
 
This is Terms and conditions page description
This is product content page description
This is privacy policy page description
The Publisher of this website makes every effort to be as accurate and complete as possible in the creation and curation of the content published on this site. However, Publisher does not warrant or represent at any time that the contents within are accurate due to the rapidly changing nature of the Internet. The Publisher will not be responsible for any losses or damages of any kind incurred by the reader whether directly or indirectly arising from the use of the information found on this website. The authors and Publisher reserve the right to make changes without notice. The Publisher assumes no responsibility or liability whatsoever on the behalf of the reader of this website. No part of the content available in the website may be reproduced or transmitted in any form or by any means, electronic or mechanical, including photocopying, recording or by any information storage and retrieval system, without written permission. This website is not intended for use as a source of legal, health, business, accounting or financial advice. All readers are advised to seek services of competent professionals in the legal, health, business, accounting, and finance fields. There are no representations or warranties, express or implied, about the completeness, accuracy, reliability, suitability or availability with respect to the information, products, services, or related graphics contained in this website for any purpose.