తెలుగులో వ్యాఖ్యాన సంప్రదాయం ఉత్పత్తి, వికాసాలు
(తెలుగు పురాణ, ఇతిహాస, కావ్యప్రబంధ వ్యాఖ్యలు)
కృతజ్ఞతలు
అమ్మానాన్నలకు; వ్యాకరణం, ప్రాచీన సాహిత్యంపై గల నా ఆసక్తిని గమనించి ఎం.ఫిల్. పిహెచ్.డి.లలో తగిన సలహాలను ఇచ్చి, నన్ను ముందుకు నడిపిన పర్యవేక్షకులు, గురువులు ఆచార్య రవ్వా శ్రీహరిగారికి; 'అమ్మడూ' అంటూ వాత్సల్యంతో ప్రోత్సహించిన కీ.శే. ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం గారికి; హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగుశాఖ సిబ్బందికి, ఈ పరిశోధన వ్యాసం వెలుగు చూడాలని ప్రోత్సహించి సంపూర్ణ సహకారాన్ని అందించిన గురుతుల్యులు డా|| పగడాల చంద్రశేఖర్ గారికి; 'ఆంధ్రభాషాభూషణ' అనే బిరుదునిచ్చి సత్కరించిన విద్యాసంవర్ధనీ పరిషత్తు కార్యదర్శులు చెన్నాప్రగడ తిరుమలరావుగారికి; గురువులు మైలవరపు శ్రీనివాసరావు గారికి, పరిశోధనలో గ్రంథసేకరణకు సహకరించిన వివిధ గ్రంథాలయాల సిబ్బందికి; శుద్ధప్రతి తయారుచేయడంలో సహకరించిన మాలతి, రామచంద్రారావు, ఝాన్సీలకు; ఈ ముద్రణప్రతి తయారుచేయడంలో సహకరించిన విశాఖపట్టణ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ గౌరవనీయ ప్రభాకరరెడ్డిగారికి, గ్రంథముద్రణలో విద్యాత్మ సహకారాన్ని సంపూర్ణంగా అందించిన డా|| మర్రదొడ్డి సుభాషిణి గారికి, నాతోనే ఉంటూ నాకు అన్నివిధాలా సహకరించిన వి.శాండిల్యకు, మిత్రులకు, సిద్ధాంతగ్రంథ ప్రచురణకు పాక్షికంగా ఆర్థికసహకారం అందించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి, ఈ పుస్తకాన్ని డి.టి.పి. ప్రతిరూపంలో అందించిన శ్రీమతి చేరాల పుష్పలతగారికి; ఈ గ్రంథాన్ని ముద్రించిన వేణు గ్రాఫిక్స్ వారికి, నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు.
దంటు హేమలత