కృతజ్ఞతలు
సజ్జన సాంగత్యమువలన తల్లిదండ్రుల ప్రోత్సాహమువలనను,
భగవత్ భాగవతాచార్యుల ప్రసంగాలు వినుటచేతను ,వారి ప్రవచనాలను సత్కథాకాలక్షేపములను ప్రత్యక్షముగా వీక్షించే భాగ్యము కల్గుట వలనను ఇంతేకాక ,నా పూర్వజన్మ సుకృతము,ఆ గోదమ్మతల్లి కరుణాకటాక్షాలు మరియు ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహము తోడై నిల్వడం వలననే నాలో పొందిన భావపరంపరాతరంగాలు నా తొలి రచనగా తిరుప్పావు ప్రబంధపాశురములను తెలుగులో స్వేచ్ఛానువాదంగా సామాన్యులకూ అర్థమగు రీతిలో శ్రీవ్రతము పేర చేయు అదృష్ఠం కలిగినది.అదేవిధంగా భగవత్ కథాంశాలను తెలుగులో అనువదించవలెననెడి కోరిక జనించినది.దానితో రెండవ రచనగా తెలుగులో స్వేచ్ఛానువాదంగా శ్రీ గోదాదేవి రచించిన నాచ్చియార్ తిరుమొజి అను గ్రంథంలోని వారణమాయిరమ్ అను దానిని మధుర స్వప్నంగా రూపొందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.గోదాదేవి యొక్క స్వప్నవృత్తాంతము ఇందులో వర్ణించబడింది.
నేను విశేష భాషా పరిజ్ఞానము కలదానినిగాని, పాండిత్య పరిజ్ఞానురాలినిగాని కాను.భగవత్ చింతనాసక్తి కల్గిన సామాన్య వ్యక్తిని. విషయాసక్తులైన పెద్దలు ,పాఠకులు సహృదయముతో ఈ తెలుగు అనువాదమును చదివి లోపాలను మన్నించి, తమ అభిప్రాయములను అందించి ఆశీర్వదించగలరని ....మనవి. నా యీ అనువాదమును పరిశీలించి తమ అభిప్రాయములను అందించి,ఆశీర్వదించిన ఆచార్యవర్యులు....
శ్రీమాన్ ఆచ్చి పాండురంగాచార్యులు గారికి,
డా||ఆచార్య వేణుగారికి, శ్రీమాన్ పె.ౖచ.సుదర్శనాచార్యులు గారికి,
శ్రీమాన్ ఇళయవెల్లి కొమాండూరు పార్థపారథి అయ్యంగారికి
శ్రీమాన్ వెలగలేటి మోహనాచార్యులు గారికి , డి.టి.పి.చేసిన శ్రీ ఉమ్మెత్తల గారికి, అందంగా అచ్చు వేసిన వేణు గ్రాఫిక్స్ వారికి, మరియు నాకు సహకరించిన కుటుంబ సభ్యులకు , శ్రీగోదాసమేత రంగనాథస్వామి ఎల్లవేళలా అండగనుండి కటాక్షించుగాక అని ప్రార్థిస్తూ నా కృతజ్ఞతాభివందనములు సమర్పించుకుంటున్నాను.
భవదీయురాలు
- ఎన్.శాంతకుమారి. రచయితి