కవి వాక్కు
మనిషి నడచు మార్గమందు, మంచి మాటయే జత
పెక్కు మంది జీవితాల, పిండితేనె సామెత
సామెతలు, సూక్తులు, సుభాషితాలు, మార్గం తెలియని మనిషికి మంచి త్రోవను చూపిస్తాయి. త్రోవ తప్పిన మనిషిని మంచి మార్గం లోకి నడిపిస్తాయి.
ఇద్దరు తల్లులు ఒక బిడ్డను తెచ్చి ఇది నా బిడ్డ అని తగువులాడుకొంటుంటే 'బిడ్డను నరికి చెరిసగం ఇవ్వండి' అనడంతో ఆ బిడ్డతల్లి అయ్యో నా బిడ్డను నరకవద్దు. దానికే ఇచ్చేయండి అంటుంది. ఇలా సత్యాన్ని శోధించడంలో దైవజ్ఞానం పొందిన మేధావి సాల్మన్‌రాజు.
దైవజ్ఞానం పొందిన సాలమన్ యెరూషలేమును పరిపాలించిన రాజు. తాను జీవిత సత్యాలను తెలుసుకోగోరి, జీవితాన్ని చిలికి రచించిన సత్యాలే ప్రసంగి గ్రంథంగా హోలీ బైబిల్లో వెలసింది. దీనికి తెలుగు, ఇంగ్లీషులలో కవితా స్పర్శ కలిగించడమే నా ఉద్దేశం.
తేదీ: 29.9.1992న దేవుడు నన్ను భయంకరమైన రైలు ప్రమాదం నుండి రక్షించాడు. అందుకు కృతజ్ఞతగా ఈ రచన చేస్తున్నాను.
ఆశీర్వచనాలు, తెల్పిన డా|| రెవ.జి. సామ్యెల్, డా|| రెవ.డి.హెచ్. పాల్, ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్, శ్రీమండ్రు సాల్మన్‌రాజు, ప్రొఫెసర్ కె.ఆనందన్ గారికి నా కృతజ్ఞతలు.
ఈ రచనలో నాకు సాయపడిన నా భార్య ప్రొఫెసర్ మేరి ఎస్తేర్ సింధియాకు, నా కుమార్తెలు పాడేటి విమలా మనోహర రూత్, పాడేటి మిరాకిల్, నా కుమారుడు పాడేటి జాషువాకు నా బావమర్ది జేమ్స్‌కు, రెవరెండ్ ఐజాక్‌కుటుంబానికి నా కృతజ్ఞతలు. ఈ ముద్రణకు ఆర్థిక సాయం చేసిన మిత్రులు శ్రీ ఎమ్. సాల్మన్‌రాజుగారికి, దీనిని చూచిన తోడనే నా చేతులమీదుగా ప్రింట్ చేస్తానన్న మిత్రులు ప్రొఫెసర్ కె. ఆనందన్ గారికి, డి.టి.పి చేసిన శ్రీమతి సి. పుష్పలతకు, ఈ పుస్తకాన్ని అందంగా ముద్రించిన వేణు గ్రాఫిక్స్ వారికిి నా కృతజ్ఞతలు.
పాడేటి జాన్సన్