నా గురించి నా కవిత్వం గురించి మిత్రుల ద్వారా తెలుసుకుని నా పుస్తక ప్రచురణకు ఆర్థిక సహాయం అందించడానికి ముందుకొచ్చిన ముగ్గురు సహృదయులున్నారు. వారు శ్రీయుతులు పెన్మెత్స బోసురాజు, టి. సురేష్ రెడ్డి, జి.పద్మనాభం. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఈ పుస్తకాన్ని ఇంత అందంగా, అనుకున్న సమయంలోనే ప్రచురించడానికి ముఖ్యకారకులు, ఆప్తమిత్రులు కుమార్, సుబ్బరాజు వారికి నేనెప్పటికీ రుణపడి వుంటాను.
ఇంకా నా కవిత్వాన్ని నిరంతరం ఎంజాయ్ చేస్తూ పుస్తకరూపంలో నా కవితలను చూడాలని ఆరాటపడి ఎటాంటి సహాయానికైనా తమ సంసిద్ధతను తెలియజేసిన మిత్రులు ఎం.ఎస్. నారాయణ, చంద్రశేఖర్ఆజాద్, రఘు,డి.వి.రాజు,మైలవరపు శ్రీనివాస్, దుర్గరాజు,జగన్ మోహన్, శిఖామణి,ఖాజా,ఉదయలక్ష్మి, వసంతలక్ష్మి, దేవి, శాంతారాం, సురేష్, ఆర్.కె.వీరూ, హరీష్, చక్రి అలాగే అమెరికాలో వుంటూ నా కవిత్వాన్ని ఆస్వాదించి ప్రచురణకు ప్రోత్సహించిన హరిశంకర్, రామకృష్ణ, శ్యామ్, శారద ఇలా ఎందరో ఎందరో మిత్రుల ప్రోత్సాహం, ప్రేరణ, సహాయసహకారాల ఫలితమే ఈ పుస్తకం.
నా పుస్తకాన్ని అడిగినవెంటనే ముందుమాట రాయడానికి అంగీకరించి ఆ మాటలో నన్ను నన్నుగా ఆవిష్కరించి ఆశీర్వదించిన ఆత్మీయ కవి మిత్రులు శివారెడ్డి గార్కి, నా పుస్తక ఆవిష్కరణకు నిండు వనస్సుతో అంగీకరించిన పూజ్యులు డా.సి.నారాయణరెడ్డి గార్కి, అందమైన అర్థవంతమైన ముఖ చిత్రాన్ని అందించిన తమ్ముడు అక్బర్ కి, నా కవితలను ప్రచురించిన ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి తదితర పత్రికలకు, కవితలన్నీ చక్కగా డిటిపీ చేసి పుస్తకం తుది రూపు దిద్దుకునే వరకు అండగా నిలబడ్డ తమ్ముడు ఎం. రవికి,
అమ్మా, నాన్నా, రాజీ....
ఇంకా నా కవితలు అచ్చులో చూడడానికి ఆరాటపడే నా బంధువులు, మిత్రులు , శిష్యులు, సహోద్యోగులు ఎందరో ఎందరో అందరికీ