Book

అమెరికా యానం-అనుభవాల గానం

దుగ్గిరాల సోమేశ్వరరావు,

Book
నా మాట

నేను 2001 సెప్టెంబర్‌ నెల మొదటివారంలో అమెరికా వెళ్ళి, అక్కడన్నీ చూసి, 2002 జనవరి నెల మొదటివారంలో తిరిగి హైదరాబాద్‌కు వచ్చాను. అప్పట్లో నా మూడో కుమారుడు చి||శ్రీనివాస్‌, భార్య చి||సౌ||వెంకటలక్ష్మి, కూతురు చి||రూప (అప్పుడు రెండు సంవత్సరాలు)తో 'కొలరొడో స్ప్రింగ్స్‌' (కొలరొడో స్టేట్స్‌) లో ఉన్నాడు. నా నాల్గవ కుమారుడు చి||అనంతరామశర్మ, భార్య చి||సౌ||శ్రీహేమవాణితో 'శాండియాగో' (కాలిఫోర్నియా స్టేట్‌) లో ఉన్నాడు. ఇక ఐదవ కుమారుడు చి||సత్యప్రభాకర్‌ (అప్పటికింకా పెళ్ళికాలేదు) 'సియోటల్‌' (వాషింగ్టన్‌ స్టేట్‌) లో ఉన్నాడు. ముగ్గురు కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా అక్కడ పనిచేస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళు ఆయా పట్టణాల్లోనే ఉంటున్నారు.
   3.9.2001 నుండి 5.10.2001 వరకు 'కొలరొడో స్ప్రింగ్స్‌'లోను, 6.10.2001 నుండి 6.11.2001 వరకు 'శాండియాగో'లోను, 7,8,11-11-2001 మూడురోజులు 'లాస్‌వెగాస్‌'లోను, 9,10-11-2001 రెండు రోజులు 'గ్రాండ్‌ కెనియన్‌'లోను, తిరిగి 12-11-2001 నుండి 24-12-2001 వరకు 'కొలరొడొ స్ప్రింగ్స్‌'లోను నేను ఉండటం జరిగింది. 'శాన్‌ఫ్రాన్సిస్‌కో' (కాలిఫోర్నియా స్టేట్‌) దగ్గర 'ఫ్రీమాండ్‌' లో ఉంటున్న చి||వేమూరి శ్రీనివాస్‌, అతని భార్య చి||సౌ||సత్యవతుల (తమ్ముడు చి||హనుమంతరావు అల్లుడు, కూతురు) ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్ళి అక్టోబర్‌ 27,28 తేదీలు వాళ్ళతో గడిపాను. ఇండియాకు తిరుగు ప్రయాణంలో మళ్ళీ 25.12.2001 తేదీకి 'శాండియాగో' వెళ్ళి, అక్కడ ఒక వారం రోజులు గడిపి, అక్కడ్నుంచి 3.1.2002 తేదీన బయలుదేరి 5.1.2002 అర్ధరాత్రికి హైదరాబాద్‌ చేరాను.
   అమెరికాలోని నా కుమారులు, కోడళ్ళు, తమ్ముడి కూతురు, అల్లుడు నా మీద ఆదరాభిమానాలు కురిపిస్తూ, ఆయా ప్రదేశాలు, వింతలు, వినోదాలు చూపిస్తూ, ఆనందంలో నన్ను ఉక్కిరిబిక్కిరి చేసారు. వాళ్ళందరికీి నా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. అవన్నీ జీవితంలో మరపురాని అనుభూతులు. అయినా నా భార్య రూపవతి (1998లో పరమపదించింది) వెంట లేదే అన్న ఆవేదన అనుక్షణం నన్ను వెంటాడుతూనే ఉంది.
   'కొలరొడొ స్ప్రింగ్స్‌'లో ఉండగా, చూసిన ప్రదేశాలు :

  1. Cave of  the winds (కేవ్‌ ఆఫ్‌ ది విండ్స్‌) కొలరొడో స్టేట్‌
  2. Garden of Gods  (గార్డెన్‌ ఆఫ్‌ గాడ్స్‌) ||
  3. Rocky Mountains  (రాకీ మౌన్‌టెన్స్‌) కొలరొడో స్టేట్‌
  4. Seven Falls (సెవెన్‌ ఫాల్స్‌) ||
  5. Helen Hunt Falls (హెలెన్‌ హంట్‌ ఫాల్స్‌) ||
  6.  Royal Gorge  (రాయల్‌ గార్జ్‌) ||
  7. Denver Town  (డెన్వర్‌ టౌన్‌) ||
  8.  Cherry Creek Mall  (చెర్రీ క్రీక్‌ మాల్‌) ||
  9. Denver  Down Town (డెన్వర్‌ డౌన్‌ టౌన్‌) ||
  10. Pickes Peak    (పైక్స్‌ పీక్‌) ||
  11.  Mount Rush More  (మౌంట్‌ రష్‌ మోర్‌) సౌత్‌ డకోటాస్టేట్‌
  12. Crazy Horse  (క్రేజీ హార్స్‌) ||
  13. Black Hills  (బ్లాక్‌ హిల్స్‌) ||
   'శాండియాగో'లో ఉండగా, చూసిన ప్రదేశాలు :
  1. Sandiago Harbour (శాండియాగో హార్బర్‌) కాలిఫోర్నియాస్టేట్‌
  2. Sea Port Village (సీ పోర్ట్‌ విలేజ్‌) ||
  3.  Coronado Bridge (కొరొనడో బ్రిడ్జ్‌) ||
  4. Point Loma (పాయింట్‌లోమా) ||
  5. Disney Land (డిస్నీ లాండ్‌) ||
  6. Sandiago Zoo (శాండియాగో జూ) ||
  7. Malibu Temples (మలిబు టెంపుల్స్‌) ||
  8.  Hollywood Universal Studios  (హాలివుడ్‌ యూనివర్శల్‌ స్టూడియోస్‌) కాలిఫోర్నియా స్టేట్‌
HnV5M2EZ6Wy4FaLZ26fJ 
  9. Wild Animal Park  (వైల్డ్‌ ఏనిమల్‌ పార్క్‌) ||
  10.  Mexico Boarder (మెక్సికో బోర్డర్‌) ||
  11. Sea World (సీ వరల్డ్‌) ||
  12.  Los Vegas (లాస్‌ వెగాస్‌) నెవడా స్టేట్‌
  13. Lake Mead (లేక్‌ మీడ్‌) ||
  14. Hoover Dam (హూవర్‌ డామ్‌) ||
  15. Grand Canyon (గ్రాండ్‌ కెన్‌యన్‌) ఆరిజోనా స్టేట్‌
   శాన్‌ఫ్రాన్సిస్‌కో దగ్గర 'ఫ్రీమాండ్‌'లో ఉండగా, చూసిన ప్రదేశాలు :
  1. Bay Area (బే ఏరియా) కాలిఫోర్నియా స్టేట్‌
  2. Golden Gate Bridge (గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జ్‌) ||
  3. The Mistary Point (ది మిష్టరీ పాయింట్‌) ||
  4. Red Wood Forest (రెడ్‌ వుడ్‌ ఫారెస్ట్‌) కాలిఫోర్నియా స్టేట్‌
  5. Santacruz  Beach (శాంతాక్రుజ్‌ బీచ్‌) ||
  6. Monte Forest (మోన్‌ట్‌ ఫారెస్ట్‌) ||
   'కొలరొడో స్ప్రింగ్స్‌' నుండి 'న్యూయార్క్‌', 'వాషింగ్టన్‌ డి.సి.', 'నయగరా ఫాల్స్‌', 'పిట్స్‌బర్గ్‌' వగైరా ప్రాంతాలకు వెళ్ళి, అవి కూడా చూద్దామని శ్రీను మా అందరికి ఎయిర్‌టికెట్స్‌ బుక్‌ చేశాడు. కాని రేపు ప్రయాణం అనగా 'న్యూయార్క్‌' పరిసరాల్లో ఉన్న ఒక రెసిడెన్షియల్‌ కాలనీలో ప్రమాదవశాత్తు ఓ విమానం కూలిపోయింది. ఇది 'శాబటేజ్‌' అన్న అనుమానంతో ఓ వారం రోజులు పైన అమెరికాలో విమానాశ్రయాలన్ని మూసివేశారు. ఆ తరువాత సమయాభావం వల్ల ఆ ప్రదేశాలకు వెళ్ళలేకపోయాం.
   నేను చూసిన ఆయా ప్రదేశాలు, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, వింతలు, వినోదాలు వగైరా వివరాలన్నిటినీ తేదీలవారీగా పూసగుచ్చినట్టు విశదీకరిస్తూ అమెరికాలో ఉండగానే వచనంలో వ్రాసాను. సందర్భానుసారంగా నా ఆనందాన్ని కొన్నిచోట్ల పద్యాల్లో కూడా వెలిబుచ్చాను.

దీన్ని పుస్తకరూపంలో అచ్చొత్తించాలన్న నా ఆలోచన అనుకోకుండా ఇంత ఆలస్యమై పోయింది. ఇప్పటికైనా ఇది విడుదలవుతున్నందుకు కొంతలో కొంత ఊరట.
   ఈ నా రచనను ఆమూలాగ్రం చదివి, నన్ను ఆశీర్వదించిన మా అన్నగారు - మహాకవి శ్రీదుగ్గిరాల రామారావుగారికి పాదాభివందనములు.
   ఈ కృతిపై 'తన స్పందన'ను అక్షర రూపంలో తెలియజేసి నన్ను ఆశీర్వదించిన అగ్రజులు డా||చాట్ల శ్రీరాములుగారికి, తన 'గానం అనుభూతిమయం'తో నన్ను అభినందించిన ఆత్మీయులు డా||జె.చెన్నయ్యగారికి నా కృతజ్ఞతాపూర్వక అభివంనదలు.
   ఈ కృతికి చక్కగా డి.టి.పి.చేసిన ఆప్తులు శ్రీ కుడుపూడి భాస్కరరావు-శ్రీమతి వరలక్ష్మి దంపతులు (మాను గ్రాఫిక్స్‌) వారికి, ముచ్చటగా ముద్రించిన శ్రీ వేణుగోపాల్‌రెడ్డి (వేణు గ్రాఫిక్స్‌) గారికి నా కృతజ్ఞతలు.
   
   - దుగ్గిరాల సోమేశ్వరరావు

Read Book

అమెరికా యానం-అనుభవాల గానం

Publication Date: Oct 01, 2010

Publisher: దుగ్గిరాల పబ్లికేషన్స్

Edition: 2010

Language: Telugu

Pages: 121

 
 
 
This is Terms and conditions page description
This is product content page description
This is privacy policy page description
The Publisher of this website makes every effort to be as accurate and complete as possible in the creation and curation of the content published on this site. However, Publisher does not warrant or represent at any time that the contents within are accurate due to the rapidly changing nature of the Internet. The Publisher will not be responsible for any losses or damages of any kind incurred by the reader whether directly or indirectly arising from the use of the information found on this website. The authors and Publisher reserve the right to make changes without notice. The Publisher assumes no responsibility or liability whatsoever on the behalf of the reader of this website. No part of the content available in the website may be reproduced or transmitted in any form or by any means, electronic or mechanical, including photocopying, recording or by any information storage and retrieval system, without written permission. This website is not intended for use as a source of legal, health, business, accounting or financial advice. All readers are advised to seek services of competent professionals in the legal, health, business, accounting, and finance fields. There are no representations or warranties, express or implied, about the completeness, accuracy, reliability, suitability or availability with respect to the information, products, services, or related graphics contained in this website for any purpose.